కనీస వేతనాల సాధనకై ఉద్యమించాలి: సిఐటియు

​పాలకొండ వెబ్ న్యూస్, 09 జూలై 2026:

​రాష్ట్రంలో స్కీమ్ వర్కర్స్, కాంట్రాక్ట్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దావాలా రమణారావు డిమాండ్ చేశారు. భామినిలో మండల కన్వీనర్ ఎం అప్పలస్వామి అధ్యక్షతన కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. 2014 నుండి వేతనాలు పెంచకపోవడంతో 50 లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఇందుకు జూలై 30, 31 తేదీలలో పార్వతీపురం మన్యం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జి జగన్నాయకులు, కే కన్యాకుమారి, పద్మ, సుమ పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, భామిని వెబ్ న్యూస్ వార్తల

Post a Comment

0 Comments