రూ.86.80 లక్షలతో పాలకొండ నగర పంచాయతీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 20-07-2026​పాలకొండ నగర పంచాయతీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగర పంచాయతీ పరిధిలోని వివిధ వార్డులలో SCSP 2025–26 నిధుల కింద సుమారు రూ.86.80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా గాయత్రి నగర్ 5వ వార్డులో రూ.23 లక్షలు, నక్కలపేట 7వ వార్డులో రూ.9.70 లక్షలు, గారమ్మ కాలనీ 14, 15, 16, 17 వార్డులలో వరుసగా రూ.5.20 లక్షలు, రూ.21 లక్షలు, రూ.4.20 లక్షల సీసీ రోడ్లతో పాటు రూ.10 లక్షల సీసీ డ్రెయిన్, అలాగే వెంకమ్మపేట 20వ వార్డులో రూ.8.50 లక్షల సీసీ రోడ్డు, రూ.5.20 లక్షల సీసీ డ్రెయిన్ పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, పాలకొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు, జనసేన జానీ, కర్నెన అప్పలనాయుడు, జాడ శ్రీధర్, పల్ల కొండబాబు, అన్నెపు శ్రీనివాస్, పోరెడ్డి ప్రశాంత్, శేఖర్, కొండదాడి రాజేష్, మాదాసి సంతోష్, మిడితాన ప్రసాద్, మజ్జి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments