పాలకొండ వెబ్ న్యూస్: 20-07-2026. రేగిడి ఆముదాలవలస మండలం ఎర్నెనపేట (గోపెంపేట) గ్రామానికి చెందిన లావేటి రుషిత, పాలకొండ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. గత మార్చి పబ్లిక్ పరీక్షల్లో 984 మార్కులు సాధించి, పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విభాగంలో డిస్ట్రిక్ట్ టాపర్‌గా నిలిచింది. ఈ విద్యార్థి అమరావతిలోని విట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత ఇంజనీరింగ్ సీటుకు ఎంపికవ్వడమే కాకుండా, ఇటీవల డైట్ సెట్‌లో రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించింది. అయినప్పటికీ సివిల్ సర్వీసెస్ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీలో చేరింది. ఈ సందర్భంగా విశ్రాంత లైబ్రేరియన్ చౌదరి నాయుడు విద్యార్థిని అభినందిస్తూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ D. అప్పారావు చేతుల మీదుగా విలువైన పుస్తకాన్ని బహూకరించారు.
0 Comments