పరిసరాల పరిశుభ్రతపై నగర పంచాయతీ కమిషనర్ సందేశం

పాలకొండ వెబ్ న్యూస్, 22 జులై 2026

​పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ రథయాత్ర పరిసర ప్రాంతాలను నగర పంచాయతీ కమిషనర్ మరియు సిబ్బంది చీపురుతో తుడిచారు. మనం ఉండే పరిసర ప్రాంతంలో మనం శుభ్రం చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ అన్నారు. తమ సిబ్బంది మాత్రమే చేయాలని అందరూ ఒకే భావంలో చూడకూడదని తెలిపారు. మనం ముందడుగు వేస్తే సిబ్బందికి కూడా చేయాలనే ఆలోచన కలుగుతుందని చెప్పారు. యాత్రకు వచ్చిన యాత్రికులకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ వివరించారు. ముఖ్యంగా డయేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments