వైద్యులకు ఘన సన్మానం

​పాలకొండ వెబ్ న్యూస్, 01-07-2026: డాక్టర్స్ డే సందర్భంగా పాలకొండలో వైద్యులను ఘనంగా సన్మానించారు. సీనియర్ చిన్న పిల్లల వైద్య నిపుణులు జే రవీంద్ర కుమార్ మరియు ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ బి శ్రీనివాసరావులను ఏపీ ఎన్జీవో సంఘం పాలకొండ తరఫున జ్ఞాపిక మరియు దుస్సాల్వతో సత్కరించారు. ఏపీ ఎన్జీ జీవో సంఘ గౌరవ అధ్యక్షులు ఎద్దు లిల్లి పుష్పనాధం మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే రంగాచారి చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పైల ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, విశ్రాంతి ఉద్యోగుల తరఫున పాలవలస రమేష్ కుమార్ మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments