శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో పుస్తకాల వితరణ

పాలకొండ వెబ్ న్యూస్ (02 జూలై, 2026): పాలకొండలో ఉన్న 16వ శతాబ్దం నాటి జగన్నాథ స్వామి ఆలయంలో కాశిన వెంకటేశ్వరరావు, రమణమ్మ దంపతులు తమ స్వీయ రచనగా ‘జగన్నాథ శోభ’ అనే 108 అష్టోత్తర పుస్తకాలను అందజేశారు. విశ్వజయము గ్రూపు సభ్యుల శ్రేయస్సును కోరుతూ స్వామి వారికి అర్చన జరిపించి, వానిని భక్తులకు వితరణ చేయమని కార్యనిర్వహణాధికారి కొండదాడి పరమేశ్వరి, ప్రధాన అర్చకులు మఠం విశ్వనాథ్, చక్రిలకు సమర్పించారు. ఈ పుస్తకంలో పూరీ జగన్నాథ స్వామి ఆలయ చరిత్రతో పాటు భారత దేశంలో గల పురాణప్రసిద్ధ, ప్రాచీన, సుప్రసిద్ధ, విచిత్ర, అద్భుత నిర్మాణాలు గల 108 జగన్నాథ స్వామి ఆలయాల విశేషాలను, ఆరాధనా స్తోత్రాలను పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో వెలమల మన్మధరావు, గజలక్ష్మి, కార్యనిర్వహణాధికారి కొండదాడి పరమేశ్వరి, ప్రసన్న గాయత్రి, టి.శంకర్ రావు, కె.వి. రమణ, కె. విజయ్ కుమార్, బాసూరు కాంత రావు, నీలాపు శ్రీను, దుంపల రమేష్ బాబు చిన్ని తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్

Post a Comment

0 Comments