పార్వతీపురం మన్యం జిల్లా విద్యా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సర్వసభ్య సమావేశం

పాలకొండ వెబ్ న్యూస్, 02-07-2026: పార్వతీపురం మన్యం జిల్లా, పార్వతీపురంలో జిల్లా విద్యా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. అన్ని యాజమాన్యాల నుండి సుమారు 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఈవో, డిఎస్డిఓ 2026-2027 సంవత్సర కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు మజ్జి రామకృష్ణ, పి చంద్రమోహన్ మరియు సంఘ బాధ్యులు మాట్లాడారు. ఈ అకడమిక్ ఇయర్ లో చేయవలసిన కార్యక్రమాలైన గ్రిక్స్, సెమినార్ కం వర్క్ షాప్, ఎస్ జి ఎఫ్ సెలక్షన్స్ మరియు పలు అంశాల కోసం చర్చించారు. నూతనంగా వ్యాయామ ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరంలో పదవి విరమణ గావించిన వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మానాలు చేయడం జరిగింది.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments