కోటదుర్గమ్మ అమ్మవారికి గజలక్ష్మి వెండి విగ్రహం సమర్పణ

పాలకొండ వెబ్ న్యూస్, 05 జూలై 2026:

​పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి ఒక భక్తుడు వెండి విగ్రహాన్ని బహూకరించారు. వీరఘట్టం మండలం బిటివాడ గ్రామానికి చెందిన వైశ్యరాజు గోవిందు అనే భక్తుడు ఈ కానుకను సమర్పించారు. (001-250-000) అక్షరముల ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు గల గజలక్ష్మి అమ్మవారి వెండి విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. ఈ గజలక్ష్మి అమ్మవారి వెండివిగ్రహాన్ని ఆలయ ఈఓ సూర్యనారాయణ, ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మి ప్రసాదశర్మలకు సదరు భక్తుడు స్వయంగా అందజేశారు. అమ్మవారికి ఈ విగ్రహాన్ని సమర్పించడం పట్ల ఆలయ అధికారులు, అర్చకులు హర్షం వ్యక్తం చేశారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments