​మీ ఓటు మీ ఆయుధం.. జులై 14 తేదీ లోగా ఎన్యూమరేషన్ ఫాం నింపి ఓటును కాపాడుకోండి!

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 03-07-2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ (EF) పత్రాలను జులై 14లోగా సంబంధిత BLOలకు తిరిగి సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లలో 98.65 శాతం మందికి, అంటే 4,10,65,045 మందికి పత్రాల పంపిణీ పూర్తయింది. అయితే ఇప్పటివరకు 1,56,76,423 మంది మాత్రమే పూర్తి చేసిన ఫారాలను తిరిగి అందజేయగా, ఇంకా 2,59,51,271 మంది నుంచి పత్రాలు రావాల్సి ఉంది. గడువులోగా ఫారాలు సమర్పించకపోతే జులై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫారంలో అవసరమైన వ్యక్తిగత వివరాలు, ఆధార్, మొబైల్ నంబర్, కొత్త కలర్ ఫొటో జతచేసి BLOకు అందజేయాలని సూచించారు. సమర్పించిన ఫారంపై BLO సంతకం చేసిన రశీదును భవిష్యత్తు అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
news by: BSS ప్రసాద్
పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments