ఖరీఫ్ సాగు సమస్యలపై కలెక్టర్ కు రైతు సంఘం విజ్ఞప్తి

పాలకొండ వెబ్ న్యూస్ , 06 జూలై 2026: పార్వతీపురం మన్యం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో ముప్పై శాతం లోటు వర్షపాతం నమోదై వరి ఆకుమళ్లు, ఎద విత్తనాలు మొలకెత్తక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ ఆటుపోట్లను ఎదుర్కొనేందుకు వ్యవసాయ, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కలెక్టర్ ను విజ్ఞప్తి చేశారు. జిల్లాలో స్థిర సాగునీటి వనరులు ఉన్నప్పటికీ, కాలువల పూడికలు తీయకపోవడం, శిథిలావస్థకు చేరిన షట్టర్స్ బాగు చేయకపోవడం వల్ల తోటపల్లి పాత కుడి, ఎడమ కాలువల చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు.

​రైతు సేవా కేంద్రాల ద్వారా తక్షణమే ఎరువుల సరఫరా ప్రారంభించి, పంటకు నష్టం చేసే అనవసర ఎరువులను బలవంతంగా అంటగడుతున్న ప్రైవేట్ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని కోరారు. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో పాటు ప్రైవేట్ ఎరువుల వ్యాపారులతో కూడా సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments