ఓటర్ల నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలి

​పాలకొండ వెబ్ న్యూస్, 06 జూలై 2026:.ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి ఆదేశించారు. సోమవారం నగర పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ మరియు ఎన్ కే రాజపురం సచివాలయాలను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఓటర్ల నుండి ఫారాలను సేకరించి, వాటిని వెంటనే డిజిటలైజేషన్ చేయాలని అధికారులకు సూచించారు. బి ఎల్ ఓ లు అందరూ పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి ఈ సందర్భంగా అధికారులను కోరారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments