పాలకొండలో విద్యార్థులకు అవగాహన సదస్సు: చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసుల పిలుపు

పాలకొండ వెబ్ న్యూస్, జూలై 9, 2026:

​స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలురులో పాలకొండ పోలీసు స్టేషన్ శక్తి టీం సిబ్బంది గణపతి రావ్, రాము మహిళ, శిశు భద్రత విషయమై విద్యార్థులతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ భవిష్యత్తు నిర్ణయించే దశ అని, దానిని సద్వినియోగం చేసుకొని కళాశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కోరారు. చెడు వ్యసనాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని, ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణించకూడదని సూచించారు. విద్యార్థుల పట్ల సోదర భావంతో మెలగాలన్నారు. విద్యార్థినులు పరాయపురుషులతో చనువుగా మెలగరాదని, ప్రలోభాలకు, మాయమాటలకు దూరంగా ఉంటూ మానప్రాణాలు కాపాడుకోవాలని చెప్పారు. ఎవరైనా అపరిచితులు చెడుగా ప్రవర్తిస్తే తక్షణమే కళాశాల సిబ్బందికి, పోలీసులకు తెలియజేయాలని సూచిస్తూ ఫోక్సో చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సిబ్బంది పీసీలు గణపతి, రాము, ఇన్చార్జి ప్రిన్సిపాల్ పైల శంకర్రావు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు, గేదెల గోవిందరావు, విజయ్ కుమార్ నాయుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments