హౌసింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

పాలకొండ వెబ్ న్యూస్, 09 జూలై 2026:

​పాలకొండ పట్టణంలో అర్హులైన లబ్ధిదారులు చేపట్టిన గృహ నిర్మాణ బిల్లులు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారని పట్టణ టిడిపి అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి హౌసింగ్ ఏఈ సుధారాణి దృష్టికి తీసుకువెళ్లారు. ఇళ్ల స్థలాలు ఉండి గృహాలు నిర్మించాలనుకునే వారు సోమవారంలోగా సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఏఈ సూచించారు. ఆన్‌లైన్ నమోదు ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, దీనివల్ల లబ్ధిదారులకు రెండున్నర లక్షల రూపాయల లబ్ధి కలుగుతుందని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు జన్నెల మురళీమోహన్, తైలపు సూర్యారావు, దుర్గారావు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments