పాలకొండలో దివ్యజీవన సత్సంగ సమావేశం

​పాలకొండ వెబ్ న్యూస్, 12 జూలై 2026:పాలకొండ నాగవంశపు వీధిలో కంచుమోజు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, తుమ్మగుంట శంకర్ రావు, జల్లు నారాయణరావు పర్యవేక్షణలో, ఎన్వీ రమణ అధ్యక్షతన భగవద్గీత పారాయణం, సత్సంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. నరుడు నారాయణుడు కావాలంటే పవిత్రత, పట్టుదల, సహనం ఉండాలని, ఉత్సాహం, ధైర్యం, బుద్ధి, శక్తి వంటి షడ్గుణాలు ఉన్నవారి వద్దే భగవంతుడు ఉంటాడని బాబా బోధనలను వివరించారు. సంపూర్ణ శరణాగతి పొందిన భక్తులకు భగవంతుడే అన్నీ సమకూరుస్తాడన్నారు. అనంతరం సతివాడ త్రినాధ స్వామి, కె. కృష్ణారావు, డి యోగేశ్వర రావు, ఎ కామేశ్వరరావు, కర్రి గోపన్న గీత విశిష్టతను విశ్లేషించారు. బోను చిన్నమ్మలు, భక్తుల ఆధ్వర్యంలో నారాయణ సేవ జరిగింది. ప్రతి నెల రెండవ ఆదివారం ఇక్కడ సత్సంగం జరుగుతుందని రమణ తెలిపారు.

Post a Comment

0 Comments