ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

పాలకొండ వెబ్ న్యూస్ 14.7.26: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) పార్వతీపురం మన్యం జిల్లా సమితి ఆధ్వర్యంలో పార్వతీపురంలో భారీ విద్యార్థి ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి బి. రవికుమార్ నాయకత్వంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. ధర్నాలో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వలరాజు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మెస్ ఛార్జీలను రోజుకు రూ.100కు పెంచాలని, జీఓ నెం.77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మూతపడిన 4,500 ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని, గిరిజన విద్యార్థుల మరణంపై విచారణ జరిపించాలని కోరారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ ఈ ధర్నాకు మద్దతు తెలిపారు.

Post a Comment

0 Comments