బాసూరు హైస్కూల్లో ఆత్మీయ సమ్మేళనం

పాలకొండ వెబ్ న్యూస్, 24 జులై 2026: ​బాసూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జామి రమేష్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు నిర్వహించిన మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ పోటీలలో మహిళా పేరెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి భాను సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించి, ఉపాధ్యాయుల జ్ఞానాన్ని వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments