ఎల్ నినో ప్రభావంపై జూలై 25 న బిటివాడలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం

పాలకొండ వెబ్ న్యూస్, 24 జులై 2026

​ఖరీఫ్ సీజన్ పంటలపై ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ అంశాలపై చర్చించేందుకు శనివారం జులై 25  ఉదయం 10 గంటలకు వీరఘట్టం మండలం బిటివాడ గ్రామంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో రెవెన్యూ డివిజనల్ పరిధిలోని సంబంధిత శాఖల అధికారులతో ఈ చర్చా కార్యక్రమం జరుగుతుంది. పాలకొండ సబ్ కలెక్టర్ ఆహ్వానం మేరకు రైతులు, ఆయకట్టు సంఘాల ప్రతినిధులు, రైతు సోదరులంతా పెద్ద సంఖ్యలో హాజరై సూచనలు, సలహాలు పొందాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు

Post a Comment

0 Comments