శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఏర్పాట్లపై సమగ్ర చర్చ

పాలకొండ వెబ్ న్యూస్, 07 జూలై 2026: ​పాలకొండ పట్టణంలో ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించబడనున్న జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. రథయాత్ర జరిగే ప్రాంతాల్లో 11 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతిరోజూ చెత్త తొలగింపు, తాగునీటి సదుపాయాలు, పార్కింగ్ ప్రదేశాల పరిశుభ్రత, రథం ప్రయాణించే రోడ్ మార్గాన్ని మరమ్మతులు చేయడం, వీధి దీపాల నిర్వహణ మరియు అదనపు వెలుతురు ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఈ పనుల కోసం నిధుల కేటాయింపు శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ చొరవతో చేపట్టబడుతుందని తెలియజేశారు. పల్లా కొండబాబు మరియు గంటా సంతోష్ కుమార్ టీం సహాయ సహకారాలతో గతంలో నిర్మించిన నందిఘోష రథం శిఖర భాగానికి ఈ సంవత్సరం కొత్త రంగులు వేయించారు. రథాన్ని తాజా పుష్పాలతో అలంకరించి, 24వ తారీకు మారుదసమి రోజు ఆనవాయితీగా బాణాసంచా కాల్చనున్నట్లు నిర్ణయించారు.

Post a Comment

0 Comments