మాజీ కేంద్ర మంత్రి, దళితుల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానేత బాబు జగజ్జీవన్‌రావ్ 40వ వర్ధంతి సందర్భంగా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ పి.వి. నూకరాజు, దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పి.వి. నూకరాజు మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్‌రావ్ సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల సాధికారత కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మాదిగల ఉద్యోగ రాష్ట్ర సమైక్య నాయకులు అలజింగి చిన్నారావు మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ మాజీ చైర్మన్ ప్రతినిధి ఆకుల కుమార్, రాష్ట్ర రెల్లికుల ఉపాధ్యక్షుడు మజ్జి బాబ్జి, గ్రంథాలయ అధికారి బబ్బుల గణేష్‌బాబు, సీనియర్ పాత్రికేయులు సబ్బా నానిబాబు, కథనం పత్రిక ఎడిటర్ యామల ఈశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు తెలుగుదేశం పార్టీ 19వ వార్డు బూత్ కమిటీ ఇన్చార్జ్ భోగి జేమ్స్, కొరటాన రవికుమార్, భోగి విశ్వేశ్వరరావు, ప్రేమ శ్రీకాంత్ బాబు, కొరటాన గోపి, తోలేటి శ్రీనివాసరావు, దళిత సంఘాల నాయకులు మరియు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments