సంకిలి షుగర్ ఫ్యాక్టరీని కొనసాగించాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్

పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 18-07-2026

​ఉంగరాడమెట్ట వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంకిలి ఐడి ప్యారీ చక్కెర కర్మాగారాన్ని మూసివేసే చర్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల 16 మంది క్షేత్రస్థాయి సిబ్బందిని తొలగించడం ద్వారా యాజమాన్యం దశలవారీగా కార్మికులను తగ్గించి ఫ్యాక్టరీని మూసివేయాలని చూస్తోందని, దీనివల్ల చెరకు రైతులు, కార్మికులు నష్టపోతారని సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పేర్కొన్నారు. యాజమాన్య అవినీతికి రైతులను బలిచేయకుండా ఎరువులు, మందులు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యులు కొండ్రు మురళి తో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ప్రజాప్రతినిధులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కిమిడి మాధవరావు, కురిటి పాపి నాయుడు, గేదెల సత్యం, తాడేల తవిటి నాయుడు, మజ్జి గణపతి రావు తదితరులతో కలిసి రాజకీయాలకు అతీతంగా త్వరలోనే విస్తృత సమావేశం నిర్వహించి కర్మాగారాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments