వివేకానంద హైస్కూల్ విద్యార్థులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ

పాలకొండ వెబ్ న్యూస్, జూలై 18, 2026:

​పాలకొండలోని స్థానిక వివేకానంద హై స్కూల్ విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు చింతా భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ పారి నాయుడు, సత్యసాయి సేవా సమితి ప్రతినిధి ఎన్ వి రమణ సమక్షంలో ఈ పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. గీత దీనుని ధీరునిగా మారుస్తుందని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఉపయోగపడుతుందని భగవద్గీత విశ్లేషణ గూర్చి చింతా భాస్కర్ నాయుడు, ఎన్వీ రమణ విద్యార్థులకి ఉపదేశించారు. భవసాగరం దాటించే ఈత వంటిది గీత అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖండ మన్మధ రావుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్

Post a Comment

0 Comments