అనాథ మృతదేహానికి మున్సిపల్ కమిషనర్ దహన సంస్కారాలు: పాలకొండలో మానవత్వం చాటుకున్న వైనం

పాలకొండ వెబ్ న్యూస్, జూలై 19, 2026: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలోని మెయిన్ రోడ్డుపై గుర్తుతెలియని యాచికురాలి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అనాథగా ఉన్న ఆమె మృతదేహాన్ని గమనించిన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పాలకొండ మున్సిపల్ కమిషనర్ కనకరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. రోడ్డు పక్కన మృతదేహం ఉండటంతో అటుగా వెళ్లే ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, వెంటనే కమిషనర్ నూకరాజు మానవతా దృక్పథంతో స్పందించి యాచికురాలి మృతదేహాన్ని స్వయంగా పాడి మోసి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మాజీ కౌన్సిలర్ జవరాజు మరియు పలువురు పాల్గొని తమ సేవలందించారు. కమిషనర్ చూపిన ఈ మానవత్వం అందరినీ కదిలించింది.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments