జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించిన విశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి ఉంగట్ల సత్య రావు

పాలకొండ వెబ్ న్యూస్, జూలై 19, 2026: స్థానిక జగన్నాథ స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. విశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి ఉంగట్ల సత్య రావు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తికి ఆలయ పురోహితులు సంప్రదాయబద్ధంగా, గౌరవపూర్వకంగా ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి పేరుమీద పురోహితులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను, పురాతన చరిత్రను వారు న్యాయమూర్తికి వివరించారు. భక్తిభావంతో సాగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బొడ్డు రామ్మోహన్, పల్లా మునుస్వామి మరియు తదితరులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ web news వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments