సత్యసాయి పాఠశాలలో విద్యార్థులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 20-07-2026:​పాలకొండ సత్యసాయి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను అందజేశారు. విశ్వహిందూ పరిషత్ మన్యం, పార్వతీపురం జిల్లా అధ్యక్షులు చింతా భాస్కర్ నాయుడు, పాలకొండ సత్యసాయి సమితి ప్రతినిధి ఎన్వి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో B. కేశవ రావు మాస్టర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వి రమణ మాట్లాడుతూ, మానవుడు ఉన్నత స్థితికి చేరుకోవడానికి భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. తీరిక సమయాల్లో భగవద్గీతను చదవాలని మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, బంకించంద్ వంటి ఎందరో ప్రముఖులు చెప్పారని గుర్తుచేశారు. బాల్యంలో తల్లిపాలు ఎంత శ్రేష్టమో, పెద్దయ్యాక భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడుతుందని పెద్దలు చెప్పారని, కాబట్టి విద్యార్థులందరూ తీరిక సమయాల్లో భగవద్గీతను చదవాలని కోరారు. అనంతరం భాస్కర్ నాయుడు, K మన్మధరావు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments