పాలకొండ వెబ్ న్యూస్: 20-07-2026..పాలకొండ మున్సిపాలిటీ ఏడవ వార్డులోని సంపత్ సాయి నగర్ వడమ కాలనీవాసులు తమ కాలనీ సమస్యలపై స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. సుమారు పది సంవత్సరాల నుండి ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నామని, నిత్యం పాములు, ఈగలు, దోమలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. కాలనీలోని సుమారు 7 రోడ్లకు డ్రైనేజీ వ్యవస్థ, సిమెంట్ రోడ్లు లేక అవస్థలు పడుతున్నామని, వీటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. అలాగే కరెంట్ సమస్యతో పాటు వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాలనీవాసుల విన్నపంపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు డ్రైనేజీ, సిమెంట్ రోడ్లకు వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేయాలని ఆదేశించారు. వీధి దీపాలను తక్షణమే బాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గర్భాన సత్తిబాబు, గంటా సంతోష్ కుమార్, కొండ దాడి రాజేష్, కొరికాన గంగు నాయుడు, కొంచాడ అరుణ్ కుమార్, అంపోలు శ్రీనివాసరావు, మిడితాన ప్రసాద్, మరియు కాలనీవాసులు నెల్లి రమణమ్మ, మంకు రాధిక, మజ్జి నిర్మల, రోజా రాణి, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments