విద్యార్థులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ

పాలకొండ వెబ్ న్యూస్, 22 జులై 2026..

​పాలకొండలోని తమ్మి నాయుడు హై స్కూల్లో విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. విశ్వహిందూ పరిషత్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ నాయుడు, ఎన్వి రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భగవద్గీత మానవుని జీవిత విధానానికి దిక్సూచి వంటిదని, జీవన మార్గాన్ని తెలియజేసే విషయాలు అందులో ఉన్నాయని సిహెచ్ భాస్కర్ నాయుడు, ఎన్వి రమణ పేర్కొన్నారు. ప్రపంచంలోని ఎందరో మహానుభావులు భగవద్గీతను చదివి పాటించారని, పిల్లలు కూడా బాల్యం నుంచే భగవద్గీత పఠనాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments