శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పాలకొండ మండలం ఎన్.కె.రాజపురం గ్రామంలో వరకట్న నిషేధ చట్టం 1961పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి K. హరిబాబు మాట్లాడుతూ వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం రెండూ చట్టప్రకారం నేరమని తెలిపారు. వరకట్న వేధింపుల సమస్యలు ఎదుర్కొంటున్న వారు, గృహ హింసకు గురైన వారు ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 15100కు కాల్ చేయవచ్చని సూచించారు. సమాజం నుండి వరకట్న వ్యవస్థను నిర్మూలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద శ్రీనివాసరావు, ప్యానెల్ న్యాయవాదులు B. రామ్ మోహన్ రావు, M. జగన్నాధ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం:
0 Comments