శ్రీ జగన్నాథ స్వామివారికి పంచలోహ ఇత్తడి కిరీటాల సమర్పణ

పాలకొండ వెబ్ న్యూస్, 23 జులై 2026

​పాలకొండలో వెలసిన శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రదేవికి కైలాష్ సాహు పంచలోహ ఇత్తడి కిరీటాలను తయారు చేయించి గురువారం అందించారు. ఆలయ అర్చకులు ఈ కిరీటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ఇటువంటి దాతలు ముందుకు రావాలని పల్లా కొండలరావు కోరారు. గతంలో నూతన రథం నిర్మాణం కూడా ఇదే తరహాలో పూర్తయిందని గుర్తుచేశారు.  జగన్నాథ స్వామి రథయాత్రలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు, ఆలయ ఈవో కే పరమేశ్వరి, రాంబాబు, చంటి, సాయి తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments