గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని, మున్సిపల్ కార్మికుల మాదిరిగా ₹21,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పాలకొండలో పి. సంగమేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ రాజకీయ వేధింపులు ఆపాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని కోరారు. మాస్కులు, గ్లౌజులు, యూనిఫాం, గమ్‌బూట్లు, ₹10 లక్షల ఇన్సూరెన్స్, ₹4,000 హెల్త్ అలవెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న పార్వతీపురం కలెక్టరేట్ వద్ద జరిగే నిరసనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి. ఆనంద్, ఆర్. సుధాకర్, ఎన్. గురువులు, కె. రవి, సిహెచ్. సంజీవి, దూసి దుర్గారావు పాల్గొన్నారు.
0 Comments