పార్వతీపురం మన్యం జిల్లాలో సాగునీటి వనరులను సద్వినియోగం చేయాల్సిన బాధ్యత జలవనరుల శాఖపై ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల వరి యద, ఆకుమళ్లు వడదెబ్బ పాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు, నదులలోని నీటిని నిల్వ చేసి కాలువల ద్వారా ఆయకట్టు భూములకు అందించి పంటలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాలవల పూడికతీత, మరమ్మతులకు నిధులు విడుదల చేసి సీజనల్ లష్కర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు, ప్రత్యామ్నాయ పంటలపై రైతులను చైతన్యపరిచేందుకు జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
0 Comments