వన్ మంత్ - వన్ విలేజ్ - ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో గ్రామ ప్రజల నుండి భూ సమస్యలు, రెవెన్యూ, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం, వ్యవసాయం, గృహాలు, పెన్షన్లు, ఉపాధి హామీ, విద్యుత్ సమస్యలపై వినతులు స్వీకరించారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పొలం గట్టు మీద చెట్టు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, అభివృద్ధి పనులను పరిశీలించారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్
0 Comments