దస్తావేజు లేఖరులకు వృత్తి భరోసా కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

​పాలకొండ వెబ్ న్యూస్, 25 జులై 2026

​ప్రభుత్వం జారీ చేసిన G.O.M.S No. 396ను రద్దు చేసి, దస్తావేజు లేఖరులకు వృత్తి భరోసా కల్పించాలని దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. లేనిపక్షంలో మా కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని  , దస్తావేజు లేఖరులకు మరియు వారితో అనుసంధానంగా పనిచేస్తున్న వారికి న్యాయం చేయాలని కోరారు. సుదీర్ఘ కాలంగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాల క్షేమం కోసం ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంతకాలతో కూడిన పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments