అమరావతి ఛాంపియన్‌షిప్‌కు క్రీడాకారుల ఎంపికలు

​పాలకొండ వెబ్ న్యూస్, 25 జులై 2026

​అమరావతి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే పాలకొండ నియోజకవర్గానికి చెందిన అండర్-17, అండర్-23 విభాగాల బాలబాలికల ఎంపికలు ఈ నెల 28, 29 తేదీల్లో సీతంపేట ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ మైదానంలో నిర్వహించనున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆర్. రాములు ఈ విషయాన్ని తెలిపారు. 28న వాలీబాల్, ఖో-ఖో, చెస్, బాస్కెట్‌బాల్, హాకీ, బాక్సింగ్ ఎంపికలు, 29న అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, యోగా, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ ట్రయల్స్ జరుగుతాయి. క్రీడాకారులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆధార్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాల జిరాక్స్‌లతో హాజరు కావాలని, వివరాలకు 9705302929 నంబరులో సంప్రదించాలని సూచించారు.

Post a Comment

0 Comments