పాలకొండలో వైభవంగా జగన్నాథుని రథయాత్ర మహోత్సవం: విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్న ఆలయం!


పాలకొండ వెబ్ న్యూస్ తేదీ: 15-07-2026

పాలకొండ: స్థానిక జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర మహోత్సవ వేడుకలు గురువారం  నుంచి అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో నయనమనోహరంగా అలంకరించారు.

రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల నడుమ ఆలయం ధగధగలాడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ గోపురాలు, ప్రాకారం చుట్టూ అమర్చిన రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లు ఆలయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలు జగన్నాథుని నామస్మరణ, మంగళవాయిద్యాలతో మార్మోగుతున్నాయి. రథయాత్రకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కే.పరమేశ్వరి తెలిపారు. మహోత్సవంలో భాగంగా స్వామివారు, బలభద్రుడు, సుభద్రా దేవి సమేతంగా అలంకరించిన రథంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు.

news by: BSS ప్రసాద్

పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments