కనీస వేతనాల కోసం కలెక్టరేట్ల వద్ద ఆందోళన: సిఐటియు, అంగన్‌వాడీ యూనియన్ పిలుపు

పాలకొండ వెబ్ న్యూస్, 15-07-2026: కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 30, 31 తేదీలలో కలెక్టరేట్ల వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ హిమప్రభ, అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి అమరవేణి పిలుపునిచ్చారు. పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్స్, మున్సిపల్, విఆర్ఏ, షాపింగ్ మాల్స్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. 2014 నుండి వేతనాలు పెంచకపోవడం వల్ల 50 లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేతనాలు సవరించాల్సి ఉన్నా, 12 ఏళ్లుగా పెంచకపోవడం దారుణమన్నారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి, గ్రీన్ అంబాసిడర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంచి, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల నాయకులు జి. జెసి బాయ్, వై. మనీ, కె. శారద, ఎం. శ్యామల, శ్రీదేవి, ఎల్. జయమ్మ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments