పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నగరపంచాయితీ పరిధిలోని కోటదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఉన్న 8 శాశ్వత హుండీలను 10.08.2026న తెరిచి లెక్కించారు. 13.05.2026 నుండి 10.08.2026 వరకు (89 రోజులు) గాను మొత్తం రూ. 11,62,037 (పదకొండు లక్షల అరవై రెండు వేల ముప్పై ఏడు రూపాయలు) ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 11 గ్రాముల 700 మిల్లీగ్రాముల బంగారం, 418 గ్రాముల వెండి లభించాయి. పాలకొండ డివిజన్ తనిఖీదారు ఎస్.రామారావు పర్యవేక్షణలో ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏ.పి.జి.బ్యాంక్ సిబ్బంది, భక్తులు, మరియు పార్వతీపురం, బలిజిపేట, కురుపాం ప్రాంతాల సేవకులు పాల్గొన్నారు.
0 Comments