రూ.1.95 కోట్ల SUDA నిధులతో వెంకటరాయుని కోనేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

​పాలకొండ వెబ్ న్యూస్, 26 ఆగస్టు 2026:

​పాలకొండ పట్టణంలోని వెంకటరాయుని కోనేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. సుమారు రూ.1.95 కోట్ల SUDA నిధులతో చేపడుతున్న ఈ పనులను పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, SUDA చైర్మన్ కొరికాన రవికుమార్ కలిసి ప్రారంభించారు. వెంకటరాయుని కోనేరును ఆహ్లాదాన్ని అందించే ఆధునిక వినోద, పర్యాటక మరియు ప్రజా సౌకర్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

​ఈ పనుల్లో భాగంగా చెరువు చుట్టూ 950 మీటర్ల రక్షణ ఫెన్సింగ్, పిల్లల కోసం చిల్డ్రన్స్ ప్లే జోన్, బాక్స్ క్రికెట్, ఓపెన్ జిమ్, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సిట్టింగ్ జోన్, ఫుడ్ కియోస్కులు, వాకింగ్ పాత్, పార్కింగ్, ఎల్‌ఈడీ లైటింగ్, వాటర్ సప్లై వ్యవస్థ మరియు పచ్చదనం పెంపొందించేలా ల్యాండ్‌స్కేపింగ్ అభివృద్ధి చేయనున్నారు. పాలకొండ పట్టణ అభివృద్ధికి నిధులను సద్వినియోగం చేస్తూ ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు కృషి చేస్తున్నామని, పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి పట్టణానికి కొత్త ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని SUDA చైర్మన్ కొరికాన రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments