వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పరిరక్షించాలి: బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బొబ్బిలి రేణుక

పాలకొండ వెబ్ న్యూస్, ఆగస్టు 3, 2026:

​ప్రతి విద్యార్థి వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందించుకోవడంతో పాటు సమాజాన్ని చైతన్యవంతం చేయాలని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బొబ్బిలి రేణుక పేర్కొన్నారు. సోమవారం కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణ పురవీధుల్లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఆవశ్యకత, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు ప్లకార్డులు, నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రేణుక మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, నీటిని పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. విద్యార్థులు పురవీధుల్లో మహిళలను కలిసి నీటి భద్రత అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్, విజయ గౌరీ, బాలమురళి, పుష్పనాదం, ప్రతాప్, లావణ్య, రమ్య, అరుణలక్ష్మి, సింహాచలం, ధనలక్ష్మి, కృష్ణవేణి, రుక్సానా బేగం, శ్రావణి, శిరీష, కార్యాలయ సిబ్బంది శ్రీను, సుధ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments