స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్యోగులకు క్రీడా పోటీలు

జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు జిల్లా స్థాయిలో బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలలో బ్యాడ్మింటన్ మహిళా విభాగంలో భామిని మొదటి స్థానంలో, జి ఎల్ పురం ద్వితీయ స్థానంలో నిలిచాయి. పురుషుల విభాగంలో కొమరాడ మొదటి స్థానం, జి ఎల్ పురం ద్వితీయ స్థానం సాధించాయి. టెన్నికాయిట్ మహిళా విభాగంలో గుమ్మలక్ష్మీపురం మొదటి స్థానంలో నిలవగా, పార్వతీపురం ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వివరాలను వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నాయకులు, నిర్వాహకులు మురళి, జాకబ్ దయానంద్, నెల్లి వెంకటరమణ, బుజ్జి, శ్రీను, నాని ఒక ప్రకటనలో తెలియజేశారు.

Post a Comment

0 Comments