పాలకొండ వెబ్ న్యూస్, ఆగస్టు 5, 2026:పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని జ్యూస్ షాపులు, హోటళ్లలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ లేయర్ ఉన్న పేపర్ గ్లాసులను ఆగస్టు 1వ తేదీ నుండి నిషేధించారు. ఈ విషయాన్ని వర్తకులకు నోటీసుల ద్వారా తెలియజేసినప్పటికీ ఇంకా వినియోగిస్తుండటంతో కమిషనర్ నూకరాజు సిబ్బందితో కలిసి పలు జ్యూస్ షాపులను తనిఖీ చేశారు. తనిఖీల్లో నిషేధిత ప్లాస్టిక్, పేపర్ గ్లాసులను స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యామ్నాయంగా మట్టి, స్టీల్, గాజు లేదా ఫైబర్ గ్లాసులను వినియోగించుకోవాలని ఇప్పటికే చెప్పామని కమిషనర్ తెలిపారు. మొదటిసారి తనిఖీల్లో గ్లాసులను మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, ఇకపై కూడా ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ లేయర్ పేపర్ గ్లాసులను వినియోగిస్తే అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించడం కొనసాగితే షాపులను సీజ్ చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
0 Comments