ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత బాధ్యతను పెంచింది: టీడీపీ మండల అధ్యక్షుడు గండి రామినాయుడు

​పాలకొండ వెబ్ న్యూస్, ఆగస్టు 7, 2026:

​పాలకొండ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ పడాల భూదేవి ఆదేశాల మేరకు "రెండేళ్ల నమ్మకం... అభివృద్ధి - సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అంపిలి గ్రామం బూత్ నెంబర్ 205 క్లస్టర్ ఇంచార్జ్ గండి గౌతమి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షుడు, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గండి రామినాయుడు హాజరయ్యారు. ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. అర్హత గల ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్థానిక సమస్యలను రామినాయుడు నమోదు చేసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని, ప్రజల విశ్వాసమే తమ బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ నీటి సంఘం అధ్యక్షులు మజ్జి జయశంకర్, సీనియర్ టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments