ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీల అమలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు పాలకొండ నియోజకవర్గం పరిశీలకులు, శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పాలకొండ టౌన్ లో ఆగస్టు 6 నుండి 9 వరకు నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. డిఎస్సీ 2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, పేపర్ లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వీరఘట్టం ఎంపీపీ దమలపాటి వెంకటరమణ నాయుడు, పొట్నూరు లక్ష్మణరావు, కణపాక సూర్య ప్రకాష్, రణస్థలం రాంబాబు, తోట సింహాచలం, బోనిగడ్డ ధర్మారావు, కూరంగి వెంకు నాయుడు, సవర సాయికుమార్, సవర చంద్రశేఖర రావు, సవర మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments