పాలకొండ వెబ్ న్యూస్, 20 ఆగస్టు 2026:పార్వతిపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం విక్రమ్ పురం గ్రామంలోని రామ మందిరం బస్సు స్టాప్ ప్రాంతంలో దశాబ్దకాలంగా బస్సులు నిలుపుదల చేయకపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక కూటమి నాయకులు పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో పాలకొండ డిపో మేనేజర్, పార్వతిపురం డిపో మేనేజర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి వినతిపత్రం అందజేయగా, డిపో మేనేజర్ సిబ్బంది వెంటనే సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో తోటపల్లి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ మాచర్ల నందిశ్వరరావు, మాజీ తెలుగుయువత మండల నాయకులు మాచర్ల అనిల్ బాబు, మాచర్ల సూర్యనారాయణ మాస్టర్, మాచర్ల హరినారాయణ మాస్టర్, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ సమాచార సేకరణ అబ్జర్వర్ జనసేన జానీ పాల్గొన్నారు. తక్షణమే విక్రమ్ పురం రామ మందిరం దగ్గర ప్రతి బస్సు ఆపాలని నాయకులు అధికారులను కోరారు. మండలంలో పలు గ్రామాల్లో బస్సులు ఆపని విషయం ఎమ్మెల్యే జయకృష్ణ దృష్టికి రావడంతో, నియోజకవర్గంలోని ప్రతి బస్సు స్టాప్ వద్ద బస్సులు నిలిపేలా డిపో మేనేజర్ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు ప్రజలకు సహకరించాలని కోరారు.
0 Comments