పాలకొండ మెయిన్ రోడ్డుపై మురికి నీరు: పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్

పాలకొండ వెబ్ న్యూస్ తేది: 24.08.2026.. ​పాలకొండ మెయిన్ రోడ్డులోని వడమ జంక్షన్ స్మార్ట్ ఎదురుగా మురికి కాలువల పూడికల వల్ల నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీనివల్ల విద్యార్థులు, చిరు వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతూ అనారోగ్యాల బారిన పడే పరిస్థితి ఏర్పడుతోందని పట్టణ పౌరు సంఘం, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు పాలకొండ నగర పంచాయతీ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛభారత్ ప్రచార ఆర్భాటానికే పరిమితం కాకుండా భౌతిక పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించి సంపూర్ణ పారిశుద్ధ్యానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నీరు కాలువల్లోకి వెళ్లకుండా రోడ్లపైకి రావడం వల్ల రోడ్లు పాడవుతున్నాయని, వడమ జంక్షన్ నుంచి నాగవంశం వీధి జంక్షన్ వరకు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని తెలిపారు. తక్షణమే కాలువల పూడికలు తొలగించాలని తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు 

Post a Comment

0 Comments