పాలకొండ వెబ్ న్యూస్ | 14 ఆగస్టు, 202680వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకొండ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలు, పోలీస్ విధులపై అవగాహన పరీక్ష నిర్వహించారు. పాలకొండ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ మరియు తమ్మినాయుడు కళాశాలల్లో సిఐ ఎ. ప్రసాద్ రావు పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షలో సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైబర్ నేరాలు, గంజాయి నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, మహిళా భద్రత వంటి అంశాలపై 30 ప్రశ్నలతో కూడిన పేపర్‌కు విద్యార్థులు సమాధానాలు అందించారు. అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై డి. వెంకన్న, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments