బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బత్తుల పవన్ సాయి నియామకం

పాలకొండ వెబ్ న్యూస్ | 14 ఆగస్టు, 2026

​భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన బత్తుల పవన్ సాయి నియమితులయ్యారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ, యువతను ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

​పవన్ సాయి 2013లో యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా, 2015లో శ్రీకాకుళం జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా, 2017లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2020లో యువ మోర్చా జోనల్ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments