పాలకొండ పట్టణంలోని విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక నిరుపేద మహిళకు ఉచితంగా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సర్జరీ చేసి ఆదుకుంది. పట్టణంలోని 20వ వార్డు నివాసి భోగాది గడ్డెమ్మ(65) గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ, గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆరోగ్యశ్రీలో ఈ వ్యాధి లేకపోవడంతో, సుమారు రెండు లక్షల ఖర్చుతో సర్జరీ చేయాల్సి వచ్చింది. బోగాది రామకృష్ణ ద్వారా విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ భాసూరు కాంతారావు స్పందించి, ఆసుపత్రి ఎండి దుబా పద్మావతి రాంబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎల్ఓసి స్పెషల్ ఫైనాన్స్ స్కీంలో అమరావతికి పంపి అనుమతులు పొందిన తర్వాత, గేదెల శరత్చంద్ర, కిలపర్తి తేజ తదితర వైద్యుల బృందం సర్జరీ విజయవంతంగా పూర్తి చేసింది. ఉచిత మందులు కూడా అందించారు. కోలుకున్న గడ్డెమ్మ ఆసుపత్రి వైద్యులకు, కాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు.
0 Comments