పాలకొండ వెబ్ న్యూస్, 17 సెప్టెంబర్ 2026: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్పై హమారా ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను పార్వతీపురం మన్యం జిల్లా ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం జిల్లా అధ్యక్షుడు బత్తిన మోహన్ ఖండించారు. హమారా ప్రసాదును తక్షణమే అరెస్టు చేసి దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్నే అవమానిస్తే సాధారణ నాయకుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అధికారపక్ష నాయకులను విమర్శిస్తే దేశద్రోహ చట్టం ఉపయోగించే బిజెపి ప్రభుత్వం, భారతరత్నను అవమానిస్తే ఎందుకు అరెస్టు చేయదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గురుబిల్లి రవికుమార్, పొట్నూరు రమేష్, జామి అనిల్, యలగడ రాజ్ కుమార్, రావాడ రవికుమార్, బత్తిన రమణ తదితరులు పాల్గొన్నారు.
0 Comments