పాలకొండ వెబ్ న్యూస్..
20 సెప్టెంబరు 2026:పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నవోదయ నగర్ లో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి. అమరవేణి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలను రూ. 42,000 గా నిర్ణయించి వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. 13 ఏళ్లుగా కనీస వేతనాలు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చడం వల్ల కార్మికుల హక్కులకు నష్టం వాటిల్లుతుందని, ఆ లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేలు వర్తింపజేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర శాసన చట్టం చేయాలని కోరారు. ఆటో, భవన నిర్మాణం, రైస్ మిల్, హమాలీలు, స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కె. గౌరీశ్వరి, ఎం. అప్పలస్వామి, జి. జగన్నాథులు, ఏ. లక్ష్మణరావు, కాదా రాము, ఎస్. లక్ష్మి, ఎన్. రొయ్యిబారి, పి. రమాదేవి, జి. సత్యం, వై. శ్రీనివాసరావు, సిహెచ్ సంజీవి, సిహెచ్ సురేష్, కే. కన్యాకుమారి, సుశీల, వి. పద్మ, శిరీష, చిట్టెమ్మ, కే. ఉషారాణి, సుజాతతో పాటు అంగన్వాడి, ఆశా, సిహెచ్డబ్ల్యూ, మధ్యాహ్నం భోజన పథకం, పాఠశాల శానిటేషన్ తదితర వివిధ రంగాల నాయకులు పాల్గొన్నారు.
news by: BSS ప్రసాద్
0 Comments