బంగారం ఆల్టైమ్ రికార్డు.. వెండి కూడా ఎగబాకింది

పాలకొండ వెబ్ న్యూస్:23.09.2925. బంగారం ఆల్టైమ్ రికార్డు.. వెండి కూడా ఎగబాకింది.
బంగారం ధర రోజురోజుకి కొత్త గరిష్ఠాన్ని తాకుతోంది. తాజాగా దిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ.2,000 పైగా పెరిగి 10 గ్రాములకు రూ.1,18,900కు చేరుకుంది. గడిచిన రోజు ధర రూ.1,16,000గా నమోదైన విషయం తెలిసిందే.
అటు వెండి కూడా భారీగా పెరిగింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, దిల్లీలో కిలో వెండి ధర రూ.1,39,600కు చేరుకుంది.
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠానికి పడిపోవడం, అమెరికాలో హెచ్-1బీ వీసా రుసుము పెంపు ప్రభావంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆశ్రయం కోసం బంగారంపై మరింతగా దృష్టి పెట్టడం ధరలను ఎగబాకేలా చేసింది.
...News..By. BSS Prasad



Post a Comment

1 Comments